: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సానుకూలం... రైల్వేశాఖకు ఆదేశాలు


ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత తెలిపింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి రైల్వేశాఖకు ఆదేశాలు వెళ్లాయి. ఆ వెంటనే రైల్వే జోన్ పై చర్చించేందుకు రైల్వేశాఖ సాంకేతిక కమిటీ సమావేశమైంది. మిట్టల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జోన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశానికి రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వనున్నారు. తాజా ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. మరునాడే కేంద్రం సుముఖత వ్యక్తం చేయడం విశేషం. దాంతో పాటు కాకినాట-కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్ కు కూడా కేంద్రం అంగీకారం తెలిపింది. అంతర్వేది డ్రెజ్జింగ్ హార్బర్ కు అనుసంధానించేలా ఈ రైల్వేలైన్ ఉంటుంది.

  • Loading...

More Telugu News