: పెళ్లికి సిద్ధమైతేనే 14న బయటకు రండి... పురోహితులు కూడా సిద్ధం!: హిందూ మహాసభ


ఫిబ్రవరి 14... వాలంటైన్స్ డే - ప్రేమికుల రోజు. మనసుకు నచ్చిన వారికి, స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపోజ్ చేసే రోజు. పాశ్చాత్య దేశాల్లో యువతీ యువకులు వాలంటైన్స్ డే ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇండియాలోనూ దాదాపు అంతే తరహాలో వేడుకలు జరుగుతాయి. ఇది భారత సంప్రదాయాలకు వ్యతిరేకమని వాదించే అఖిల భారత హిందూ మహాసభ ప్రతి సంవత్సరంలానే ఈ ఏడు కూడా ప్రేమికులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ రోజున బహిరంగ ప్రదేశాల్లో, పార్కుల్లో కనిపించే ప్రేయసీ ప్రియులకు అప్పటికప్పుడు వివాహం చేసేస్తామని మహాసభ జాతీయ కార్యదర్శి మున్నా కుమార్ శర్మ తెలిపారు. యూరప్ వంటి దేశాల్లో కుటుంబ వ్యవస్థ, వివాహాలు లేని సమయంలో వాలెంటైన్స్ డేను అందుకు వాడుకున్నారని, ఇండియాలో ఆ పద్ధతులకు తాము వ్యతిరేకమని తెలిపారు. 14న మొత్తం 10 వేల మంది వాలంటీర్లు ప్రేమికులను నిలువరించేందుకు వీధుల్లో పహారా కాస్తారని తెలిపారు. వారికి వివాహాలు చేసేందుకు పురోహితులను సైతం సిద్ధం చేశామని వివరించారు. గత సంవత్సరం ప్రేమికుల రోజున 100 వివాహాలు చేశామని, వివాహానికి సిద్ధమైతేనే ప్రేయసీ ప్రియులు 14న బయటకు రావాలని అన్నారు. మరోవైపు భజరంగదళ్ సైతం ఇదే విధమైన హెచ్చరికలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News