: ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం మెచ్చుకుంది: అధికారులతో చంద్రబాబు
రాష్ట్రంలో అమలవుతున్న ఉపాధి హామీ పథకం అమలు తీరును కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందని సీఎం చంద్రబాబు అధికారులతో అన్నారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి పల్లెను మెడల్ విలేజ్ గా తయారు చేసేందుకు జన్మభూమి కమిటీలు చిత్తశుద్ధితో పని చేయాలని సీఎం కోరారు. ఇక పంట సంజీవని పథకంపై ప్రజలందరిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చూడాలని స్పష్టం చేశారు.