: కారు ప్రమాదం... తృటిలో ప్రాణాలు దక్కించుకున్న ప్రపుల్ల కుమార్ మహంతా!


అసోం మాజీ సీఎం ప్రపుల్ల కుమార్ మహంతా కుటుంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికాగా, కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. గౌహతి నుంచి తన సొంత నియోజకవర్గం బర్హంపూర్ కు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వేగంగా వస్తున్న వీరి కారు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్ ను ఢీకొన్నట్టు సమాచారం. ఈ ఘటనలో కారులో ఉన్న మహంతా, ఆయన కుమారుడు, మరో ఇద్దరు గాయపడగా, వారిని సమీపంలోని నాగాన్ రీజనల్ హాస్పిటల్ కు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News