: ఢిల్లీ వీధుల్లో ‘డ్రంకెన్’ యువతి రభస... బాయ్ ఫ్రెండ్ తో కలిసి 3 గంటల పాటు వీరంగం
మద్యం మత్తు తలకెక్కిన ఓ యువతి దేశ రాజధాని ఢిల్లీ నడి వీధుల్లో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత నానా రభస చేసింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి మద్యం సేవించిన ఆ యువతి తన ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారుతో బైక్ పై వెళుతున్న యువకులను ఢీకొట్టింది. అంతేకాక తనను నిలువరించేందుకు యత్నించిన పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. ఎలాగోలా సదరు యువతిని పట్టుకుని పోలీసులు ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యుల పట్ల కూడా ఆమె అసభ్యంగా ప్రవర్తించింది. నడి రేయిలో దాదాపు మూడు గంటల పాటు ఆ యువతి చేసిన నానా రభసకు చెందిన వీడియో ప్రస్తుతం జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.