: ఏపీకి తీపి కబురు!...‘హోదా’పై కసరత్తు జరుగుతోందన్న మోదీ


ఢిల్లీ పర్యటనలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ సారి ఒకింత మంచి ఫలితాలనే సాధించారని చెప్పాలి. ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా, ప్రధాని నోటి నుంచి ఏపీకి ప్రత్యేక హోదా మాటను ఆయన వినిపించలేకపోయారు. తాజాగా నిన్నటి భేటీలో మాత్రం మోదీ నోటి నుంచి ఏపీకి ప్రత్యేక హోదా మాటను ఆయన రాబట్టగలిగారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలా ఆదుకుంటాం. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయం. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నీ తుచ తప్పకుండా నెరవేరుస్తాం. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలకు సంబంధించి కూడా నీతి ఆయోగ్ నుంచి నివేదిక అందింది. దాన్ని ఎలా అమలు చేయాలన్న దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. తప్పకుండా త్వరలోనే శుభవార్త వింటారు’’ అని నిన్నటి భేటీలో చంద్రబాబుకు మోదీ చెప్పారు.

  • Loading...

More Telugu News