: ఉరికి వీడ్కోలు?... న్యాయ కమిషన్ సిఫారసుపై రాష్ట్రాల అభిప్రాయాలు కోరిన కేంద్రం
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ లో ఇంకా ఉరి శిక్ష అమలు ఏమిటనే ప్రశ్న ఇకపై వినిపించదేమో. సుదీర్ఘకాలంగా వినిపిస్తూ వస్తున్న ‘ఉరి శిక్ష రద్దు’ డిమాండ్ కు కేంద్రం సానుకూలంగా స్పందించింది. జాతీయ న్యాయ కమిషన్ గతేడాది చేసిన కొన్ని కీలక సిఫారసుల్లో ఉరి శిక్ష రద్దు కూడా ఉంది. దీనిపై వేగంగా పావులు కదిపిన కేంద్ర ప్రభుత్వం... ఉరి శిక్ష రద్దుపై అభిప్రాయాలు తెలపాలంటూ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. అంటే, ఉరి శిక్ష రద్దుకు తాము సానుకూలంగానే ఉన్నామని కేంద్రం చెప్పకనే చెప్పేసింది. రాష్ట్రాలు కూడా ఉరి శిక్ష రద్దుకు సరేనంటే... ఇక మరణ దండన అటకెక్కడం ఖాయమే. అయితే ఉగ్రవాదులు, దేశంపై యుద్ధాన్ని ప్రకటించిన వారికి మాత్రం ఈ విషయంలో ఉరిశిక్ష మినహాయింపేమీ ఉండదు. ఈ తరహా నేరాలు మినహా మిగిలిన అన్ని కేసుల్లో జీవిత ఖైదే ఇక అతి పెద్ద శిక్షగా ఉండనుంది.