: నా కళ్లద్దాలు 50 వేలకు, వాచ్ పది లక్షలకు ఇస్తా, తీసుకొమ్మనండి: కర్ణాటక ముఖ్యమంత్రి


తన కళ్ల జోళ్లు 50,000 రూపాయలకు, తన చేతి వాచ్ పది లక్షల రూపాయలకు ఇచ్చేస్తా తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సవాలు విసిరారు. లోహియా ఆదర్శాలను పాటించే వ్యక్తిగా తనను తాను సిద్ధరామయ్య చెప్పుకుంటారు కానీ, ఆయన ధరించే కళ్ల జోడు ఖరీదు రెండు లక్షలు, ఆయన ధరించే వాచ్ ఖరీదు 60 నుంచి 70 లక్షల రూపాయలు ఉంటాయని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. కావాలంటే తను చెప్పిన ధరకు వాటిని తీసుకోవాలని ఆయన చాలెంజ్ చేశారు. దీనిపై కుమారస్వామి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, సిద్ధరామయ్య ధరించే వాచ్ హ్యూబ్లోట్ బ్రాండ్ కు చెందినదని, ఈ వాచ్ ను బంగారపు పూతతో తయారు చేస్తారని, గంటలను సూచించే స్థానంలో వజ్రాలను పొదుగుతారని చెప్పారు. ఓ వివాహ వేడుకకు సిద్ధరామయ్య హాజరైన సందర్భంగా తీసిన వీడియోను చూసి, దానిని దుబాయ్ కు పంపి వాచ్ ధరను నిర్ధారించుకుని మాట్లాడుతున్నానని కుమారస్వామి వెల్లడించారు.

  • Loading...

More Telugu News