: గ్రేటర్ ఎన్నికల్లో నా డ్యూటీ నేను చేశా... ప్రజా నిర్ణయంపై సమీక్షించుకుంటాం: చంద్రబాబు


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పలేదు. మొత్తం 150 డివిజన్లలో బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ... 90కి పైగా డివిజన్లలో తన అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే సింగిల్ డివిజన్ (కేపీహెచ్ బీ) లోనే విజయకేతనం ఎగురవేసిన టీడీపీ, మిగిలిన అన్ని డివిజన్లలో పరాజయం పాలైంది. ఈ పరాభవాన్ని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అంత తొందరగా మరిచిపోయేలా లేరు. ఇప్పటికే ఎన్నికల పలితాలపై పలుమార్లు మాట్లాడిన చంద్రబాబు, తాజాగా ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడిన సందర్భంగానూ ఆ ఫలితాలను గుర్తు చేసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం రెండు రోజుల పాటు హైదరాబాదులోనే ఉన్న చంద్రబాబు... ఆ 48 గంటల పాటు గ్రేటర్ ప్రచారంపైనే దృష్టి సారించారు. ఇక ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ తో పోటీ పడి మరీ ప్రచారం చేశారు. అయినా ఒక్క స్థానం మినహా టీడీపీ విజయం సాధించలేకపోయింది. ఈ ఫలితాలపై ఢిల్లీ మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘‘గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో నా డ్యూటీ నేను చేశాను. ప్రజా తీర్పుపై సమక్షించుకుంటా’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News