: ఆరోపణలు నిజమని నిరూపిస్తే...మంత్రి వర్గం నుంచి తప్పుకుంటా: 'ఆప్' మంత్రి
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో మంత్రిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ సన్నిహితులుగా పేర్కొంటున్న కొంత మంది లంచం తీసుకుంటుండగా వీడియో తీశామని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ వీడియోలో మంత్రి హుస్సేన్ సోదరుడు కూడా ఉన్నారని కాంగ్రెస్ తెలిపింది. దీనిపై స్పందించిన మంత్రి, కాంగ్రెస్ చేసిన ఆరోపణలు అవాస్తవాలని స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎవరైనా లంచం తీసుకున్నారని నిరూపిస్తే మంత్రి వర్గం నుంచి వైదొలగుతానని ఆయన ప్రకటించారు. గతంలో ఆప్ కు చెందిన మాజీ మంత్రి అహ్మద్ ఖాన్ పై ఇదే రకమైన ఆరోపణలు రావడంతో విచారణ చేసిన ఆప్, నిజమని నిర్ధారించింది. దీంతో ఆయన మంత్రి పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.