: బీజేపీకి షాకిచ్చిన ‘షాట్ గన్’... నితీశ్, లాలూతో శత్రుఘ్ను సిన్హా భేటీ


‘కమలం’ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత, పూర్వ రంగంలో బాలీవుడ్ నటుడు, పాట్నా సాహిబ్ ఎంపీ శత్రుఘ్ను సిన్హా షాకిచ్చారు. షాట్ గన్ గా పేరొందిన ఆయన కేంద్రంలో అదికార పగ్గాలు చేపట్టిన బీజేపీకి భారీ షాకే ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న సిన్హా... బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంతో మాటల తూటాలు పేల్చడం ప్రారంభించారు. తాజాగా బీహార్ లో బీజేపీకి ప్రత్యర్థి పార్టీలైన జేడీయు, ఆర్జేడీలకు ఆయన సన్నిహితంగా మెలగుతున్నారు. నిన్న రాత్రి పాట్నాలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన సిన్హా... జేడీయు నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో భేటీ అయ్యారు. తాజాగా నేడు ఆయన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తోనూ బేటీ అయ్యారు. సోదరుడితో కలిసి ఎయిర్ పోర్టుకు వచ్చిన సిన్హా... అక్కడికి తన భార్య, మాజీ సీఎం రబ్రీదేవితో వచ్చిన లాలూతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

  • Loading...

More Telugu News