: ఈ కవలలు వెరీ వెరీ స్పెషల్...!
లక్షలాది కేసుల్లో ఒకసారి మాత్రమే చోటుచేసుకునే ప్రత్యేకత ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ లో జన్మించిన కవలల విషయంలో చోటుచేసుకుంది. వివరాల్లకి వెళితే... మామూలుగా కవలలు అన్నాక ఇంచుమించు ఒకేలా వుంటారు. లేదా పూర్తి భిన్నంగా వుంటారు. అయితే హన్నాయార్కర్, కేల్ ఆర్మ్ స్ట్రాంగ్ దంపతులకు జన్మించిన కవలలు మైలా, అనాయాలు ఒకరు తండ్రిని పోలి ఉంటే, మరొకరు తల్లిని పోలి ఉండడం విశేషం. హన్నా శ్వేతజాతీయురాలు కాగా, ఆర్మ్ స్ట్రాంగ్ మిశ్రమజాతికి చెందిన వ్యక్తి. మైలా, అనాయా పుట్టినప్పుడు బ్రౌన్ కలర్ లో పుట్టారు. రోజులు గడిచే కొద్దీ మైలా తండ్రిలా బ్రౌన్ కలర్ లోనే ఉండగా, అనాయా మాత్రం తల్లిలా మారింది. కేవలం శరీర రంగులోనే కాకుండా జట్టు, కళ్లు తదితరాలన్నీ తల్లిని పోలినట్టు మార్పులు చెందడం విశేషం. దీనిపై వైద్యులు మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు మిలియన్లలో ఒకరి విషయంలో మాత్రమే జరుగుతాయని పేర్కొన్నారు. దీంతో వీరికథ అందర్నీ ఆకర్షిస్తోంది.