: టాస్ గెలిచిన శ్రీలంక... టీమిండియాను ఫస్ట్ బ్యాటింగ్ కు ఆహ్వానించిన చండీమాల్


భారత్, శ్రీలంకల మధ్య మూడు టీ20ల సిరీస్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ మరికాసేపట్లో పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా మొదలు కానుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి కొద్దిసేపటి క్రితం టాస్ ముగిసింది. పర్యాటక జట్టు లంక టాస్ నెగ్గడంతో, కెప్టెన్ దినేశ్ చండీమాల్ ఫీల్డింగ్ కు మొగ్గుచూపాడు. ఆతిథ్య దేశ జట్టు టీమిండియాను అతడు ఫస్ట్ బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్ లో ఆసీస్ భరతం పట్టి మంచి ఊపు మీదున్న ధోనీ సేన మరికాసేసట్లో బ్యాటింగ్ ప్రారంభించనుంది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు టీమిండియా ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నారు. ఆసీస్ తో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగుతోంది.

  • Loading...

More Telugu News