: కేటీఆర్ తో 'వాల్ మార్ట్' సీఈఓ భేటీ... కార్మికుల నైపుణ్యాభివృద్ధికి మూడు ఒప్పందాలు


తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి హోదాలో ఉన్న కల్వకుంట్ల తారకరామారావు... రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రాబట్టే పనిని తన భుజానికెత్తుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం సాధించిపెట్టిన ఆయనకు సీఎం కేసీఆర్ మంచి బహుమానమే ఇచ్చారు. ఇప్పటికే ఆయన పర్యవేక్షణలో రెండు కీలక శాఖలు ఉండగా, తాజాగా పురపాలక శాఖ బాధ్యతలను కూడా కేటీఆర్ కు అప్పజెబుతూ నిన్న అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిన్న ముంబై వెళ్లిన కేటీఆర్... అక్కడ టాటా, అంబానీలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు, వివిధ రంగాల్లో ప్రభుత్వానికి బాసటకు సంబంధించి వారి నుంచి కీలక హామీలు తీసుకుని ఆయన హైదరాబాదు వచ్చారు. తాజాగా నేటి మధ్యాహ్నం ప్రపంచ రిటైల్ చైన్ స్టోర్ దిగ్గజం వాల్ మార్ట్ సీఈఓ ఎన్రిక్ ఓస్తలే మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అసంఘటిత రంగంలోని కార్మికులకు వృత్తి నైపుణ్యంలో శిక్షణకు సంబంధించి కీలక చర్చలు జరిగాయి. చర్చలతోనే సరిపెట్టని కేటీఆర్, వాల్ మార్ట్ చీఫ్ తో ఏకంగా మూడు ఒప్పందాలు కూడా చేసుకున్నారు.

  • Loading...

More Telugu News