: శ్రీలంకను తక్కువ అంచనా వేయడం లేదు: ధోనీ
శ్రీలంక జట్టును తక్కువ అంచనా వేయడం లేదని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. పూణేలో కాసేపట్లో తొలి టీట్వంటీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ధోనీ మాట్లాడుతూ, ఫేవరేట్ గా బరిలో దిగుతున్నామని అన్నాడు. అయితే శ్రీలంక జట్టులో ప్రతిభావంతులైన క్రీడాకారులున్నారని చెప్పాడు. ఈ సిరీస్ లో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా బొక్కబోర్లా పడడం ఖాయమని ధోనీ అభిప్రాయపడ్డాడు. యువ శ్రీలంక జట్టుతో జాగ్రత్తగా ఆడాలని సహచరులకు సూచించాడు. ఈ సిరీస్ లో రాణిస్తే టీట్వంటీ వరల్డ్ కప్ లో రాణించేందుకు సరిపడా ఆత్మవిశ్వాసం సమకూరుతుందని ధోనీ తెలిపాడు. కాగా మరి కాసేపట్లో టీట్వంటీ మ్యాచ్ పూణేలో ప్రారంభం కానుంది.