: హైదరాబాద్ లో 22 ఏళ్ల టీసీఎస్ ఉద్యోగిని అదృశ్యం


హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్న ఓ సాప్ట్ వేర్ ఉద్యోగిని అదృశ్యమైంది. ఆమె పేరు అనుశ్రీ. వయసు 22 సంవత్సరాలు. కర్ణాటకకు చెందిన ఆమె గచ్చిబౌలిలోని దివ్యశ్రీ ఉమెన్స్ పీజీ హాస్టల్ లో ఉంటోంది. తనకు ఆరోగ్యం బాగోలేదని నిన్న(సోమవారం) తండ్రి ప్రభాకర్ కి ఫోన్ చేసి చెప్పింది. ఇందుకు తండ్రి తాను వెంటనే వచ్చి ఆసుపత్రికి తీసుకువెళతానని కుమార్తెకు చెప్పాడు. తరువాత అనుశ్రీ ఫోన్ స్విచ్ఛాప్ చేయడంతో వెంటనే తండ్రి బయలుదేరి ఇవాళ హైదరాబాద్ వచ్చారు. కుమార్తె కోసం హాస్టల్ కి వెళ్లగా ఆఫీసుకు వెళుతున్నట్టు చెప్పిందని నిర్వాహకులు తెలిపారు. అక్కడి నుంచి టీసీఎస్ కార్యాలయానికి వెళ్లగా అక్కడ కూడా అనుశ్రీ లేదని చెప్పారు. దాంతో ఉదయం ఆఫీసుకు బయలుదేరి వెళ్లిన కుమార్తె కనిపించడం లేదంటూ గచ్చిబౌలి పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News