: అండర్-19 క్రికెట్ ఫైనల్ లో భారత కుర్రాళ్లు!


అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్ పోటీల్లో భారత కుర్రాళ్ల జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. బంగ్లాదేశ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. 268 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 42.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. దీంతో 97 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ ఆటలో అద్భుతంగా రాణించిన అనుమోల్ ప్రీత్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక 11వ తేదీన వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య రెండో సెమీ ఫైనల్ పోటీ జరుగనుండగా, అక్కడ గెలిచే జట్టుతో 14న ఫైనల్ లో భారత జట్టు తలపడనుంది.

  • Loading...

More Telugu News