: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకి తృటిలో తప్పిన ముప్పు!
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఇంజన్ లో సమస్యలు తలెత్తడంతో దానిని కిందకు దించేందుకు పైలట్ చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరికి న్యూఢిల్లీకి 30 కిలో మీటర్ల దూరంలో హిందన్ ఎయిర్ బేస్ వద్ద హెలికాఫ్టర్ ను దించివేశారు. కిరణ్ రిజిజుతో పాటు బీజేపీ ఎంపీ మాలా రాజ్యలక్ష్మి షా, హోం మంత్రిత్వ శాఖాధికారులు, ఇద్దరు టీవీ జర్నలిస్టులు కూడా అందులో ఉన్నారు. అనంతరం రిజిజు, మాలా రాజ్యలక్ష్మిని ఎంఐ-175వి5 హెలికాఫ్టర్ లో పంపించారు. ఈ సంఘటన జరిగిన కాస్సేపటికి, తామంతా క్షేమంగానే ఉన్నామని రిజిజు తెలిపారు.