: జస్ట్ పది అడుగుల వెడల్పున్న ఆ ఇంటి ఖరీదు రూ. 7.86 కోట్లు మాత్రమే!


దక్షిణ లండన్ పరిధిలో రెండు భవనాల మధ్య కేవలం పది అడుగుల వెడల్పులో ఉన్న ఇల్లు అది. దీన్ని అమ్మకానికి ఉంచితే ఏకంగా రూ. 7.86 కోట్ల (8 లక్షల పౌండ్లు) పలికింది. సుమారు 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకదానిపై ఒకటున్న రెండు బెడ్ రూములు, రెండు బాత్ రూములు మాత్రమే ఉన్న ఈ తరహా ఇల్లు లండన్ లో వినూత్నమైనదని నిర్మాణ రంగ ఏజంట్లు వ్యాఖ్యానించారు. ఈ ఇంటికి కనీసం వెనుకవైపు డోర్ కూడా లేదు సరికదా, పై అంతస్తు కప్పు కూడా సరిగ్గా ఉండదు. అయితేనేం, ఓపెన్ ప్లాన్ రిసెప్షన్, అధునాతన కిచెన్ ఏరియా, కాస్తంతే ఉన్నా ప్రైవేట్ గార్డెన్ దీని సొంతం. అందుకే ఈ ఇంటికి అంత ధర పలికిందంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు.

  • Loading...

More Telugu News