: వంద కిలోల బరువెత్తి, కండబలం చూపించిన హీరోయిన్ సమంత!


ఇటీవలి కాలంలో హీరోయిన్లు కూడా తమ శరీరాకృతిపై దృష్టి పెడుతూ, నిత్యమూ జిమ్ లలో ఎక్సర్ సైజులు చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా అందాల నటి సమంత సైతం అదే దారిలో నడుస్తోంది. మొన్నటి వరకూ తేలికపాటి వ్యాయామానికే పరిమితమైన సమంత, ఇప్పుడు భారీ ఎత్తున కసరత్తులు ప్రారంభించింది. ఏకంగా 100 కిలోల బరువును మూడుసార్లు పైకెత్తింది. దీన్ని ఆమె ట్రయినర్ తన మొబైల్ లో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. వెయిట్ లిఫ్టింగ్ తరువాత సమంత తన కండలను ప్రదర్శిస్తూ, కెమెరావైపు చిలిపిగా చూడటం కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ తో 'బ్రహ్మోత్సవం' చిత్రంలో నటిస్తున్న సమంత, ఏ చిత్రం కోసం ఇలా కండలు పెంచుతోందో వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News