: చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టాలి: వైఎస్సార్సీపీ


దళితులను అవమానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని, రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ రైల్వేకోడూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులను అవమానించేలా మాట్లాడుతున్న చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని, కాపులను, బీసీలను బాబు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని, టీడీపీ దళిత నేతలు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని శ్రీనివాసులు సూచించారు. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News