: తప్పుడు ఐడీలతో మహరాజ్ పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోకి వెళ్లబోయిన ఇద్దరు వ్యక్తులు... అరెస్ట్!
తాము కూలీలమని చెబుతూ, తప్పుడు ఐడెంటిఫికేషన్ కార్డులతో మహరాజ్ పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోకి ప్రవేశించబోయిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ ఎవరన్న విషయాన్ని విచారిస్తున్నామని తెలిపారు. గ్వాలియర్ ఎయిర్ బేస్ లో భాగంగా ఉన్న ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో సుఖోయ్-30 ఎంకేఐ, మిరేజ్-2000 యుద్ధ విమానాలు అనేకం ఉంటాయి. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి తరువాత, అన్ని యుద్ధ విమానాల బేస్ స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ తాజా ఘటనపై పూర్తి సమాచారం వెలువడాల్సి వుంది.