: కాపులను ఎట్టి పరిస్థితుల్లోను బీసీల్లో చేర్చవద్దు: బీసీ జనసభ


కాపుల రిజర్వేషన్లపై ప్రభుత్వం ముందుకెళుతున్న సమయంలో పలు బీసీ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ విజయవాడలోని చుట్రగుంట టింబర్ మర్చంట్ ఛాంబర్ హాలులో బీసీ జనసభ ఆధ్వర్యంలో రిజర్వేషన్లపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. సదస్సుకు హాజరైన బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ, కాపులను ఎట్టి పరిస్థితుల్లోను బీసీలలో చేర్చవద్దని కోరారు. కాపుల్లో చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారని, కాబట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. కాపులను చేర్చడం వల్ల బీసీల జాతికి అన్యాయం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, కాపులకు మరో విధంగా న్యాయం చేయాలని కోరారు. మరోవైపు విజయవాడ ఐలాపురం హోటల్ లో బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ సదస్సు జరుగుతోంది. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో కూడా కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ వైఖరి, బీసీల కార్యాచరణపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News