: టీడీపీకి చెందిన 'గ్రేటర్' ఒకేఒక్కడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ టీఆర్ఎస్ లోకి జంప్!
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన ఒకే ఒక్క అభ్యర్థి, కేపీహెచ్ బీ డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు తెరాసలో చేరిపోయేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిన్ననే ఓ మంత్రి ద్వారా సమాచారాన్ని సీఎంకు చేరవేసిన ఆయన, ఈ ఉదయం కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. శ్రీనివాసరావుకు సీఎం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడంతో, ఇక ఆయన చేరిక లాంఛనమే కానుంది. కాగా, నేడు కేసీఆర్ స్వయంగా పలకరించనున్న సందర్శకుల జాబితాలో తెలుగుదేశం పార్టీకి చెందిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేరు కూడా ఉంది. ఆయన కూడా సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద ప్రస్తుతం వేచివున్నారు. వీరిద్దరితో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.