: ఏప్రిల్ 6 నుంచి వీఐటీ బీటెక్ ప్రవేశపరీక్షలు


తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ)లో బీటెక్ ప్రవేశ పరీక్షలు మరో రెండు నెలల్లో జరగనున్నట్లు వర్శిటీ వ్యవస్థాపక కులపతి డాక్టరు జి.విశ్వనాథన్ తెలిపారు. బీటెక్ ప్రవేశ పరీక్షలు వచ్చే ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. వెల్లూరు, చెన్నై క్యాంపస్ లలో దాదాపు 4,500 బీటెక్ సీట్ల కోసం దేశ వ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నామన్నారు. దేశ వ్యాప్తంగా 112 కేంద్రాల్లో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 17వ తేదీల మధ్య జరుగుతాయన్నారు. ఏప్రిల్ 28న ఫలితాలు వెల్లడించి, మే 11 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, జూలై మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 29 చివరి తేదీ అని, మరిన్ని వివరాలకు http://www.vit.ac.in/ వెబ్ సైట్ ను సంప్రదించాల్సిందిగా కోరారు. ఆయా రాష్ట్రాల్లోని ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షా ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిన వారికి, వీఐటీ ఎంట్రన్స్ లో ర్యాంకులు సాధించిన వారికి వారి ప్రతిభ ఆధారంగా 25 నుంచి 75 శాతం వరకూ ఫీజులో రాయితీ అందిస్తామని వివరించారు. ఏపీలో తమ సంస్థను ఏర్పాటు చేయమని అక్కడి ప్రభుత్వం ఆహ్వానించిందని.. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని విశ్వనాథన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News