: నేడు ఢిల్లీలో బిజీగా చంద్రబాబు... పూర్తి టూర్ షెడ్యూల్!


ఎన్డీయే సమావేశం నిమిత్తం నిన్న ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇవాళ బిజీబిజీగా గడపనున్నారు. ఉదయాన్నే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయిన ఆయన, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా అంశాలపై చర్చలు జరిపారు. మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో సమావేశం కానున్న ఆయన, రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి కొత్త రైలు మార్గాలు, రైళ్లు, వివిధ ప్రాజెక్టులపై సిఫార్సులు చేయనున్నారు. ముఖ్యంగా అమరావతికి కనెక్టివిటీ పెంపు, నడికుడి - శ్రీకాళహస్తికి మరిన్ని నిధులు తదితర అంశాలపై చర్చలు సాగించనున్నారు. ఆపై భోజన విరామం తరువాత కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి, అధికారులతో సమావేశం కానున్నారు. 3:30 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమై, బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి నిధులు, ఏపీ లోటు తీర్చేందుకు కేటాయింపులు పెంచాలని కోరనున్నారు. సాయంత్రం 4:45కు ప్రధాని మోదీతో సమావేశమై ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు. సాయంత్రం 6:30కి రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రహదారుల విస్తరణపై తన వినతులను తెలియజేయనున్న చంద్రబాబు, రాత్రికి తిరిగి బయలుదేరతారు.

  • Loading...

More Telugu News