: కర్నూలులో దారుణం... మురుగు కాల్వలో నలుగురు శిశువుల మృతదేహాలు
కర్నూలు నగరంలో దారుణం జరిగింది. ఇక్కడి ఆనంద్ థియేటర్ సమీపంలోని మురుగు కాల్వలో పూడికలను తొలగిస్తుండగా, నాలుగు ఆడ శిశువుల మృతదేహాలు వెలుగుచూశాయి. వీరందరి వయసు ఏడాదిలోపే ఉండటం గమనార్హం. ఎవరో వీరిని కని, ఆపై పెంచలేక కాల్వలో పారేసి ఉంటారని భావిస్తున్నారు. శిశువుల మృతదేహాలు చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చి కన్నీరు పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. శిశువుల దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.