: నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలా కన్నుమూత


నేపాల్ మాజీ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా(79) నేటి ఉదయం కన్నుమూశారు. నేపాల్ ప్రధానిగా ఎన్నికైన ఆయన ఆ దేశ కొత్త రాజ్యాంగంపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో 2014, ఫిబ్రవరి 10న తన పదవికి రాజీనామా చేశారు. 1939, ఆగస్టు 12న భారత్ లోని బెనారస్ లో జన్మించిన సుశీల్ కొయిరాలా 1954లో రాజకీయాల్లోకి వచ్చారు. 1960లో ఆ దేశంలో రాజరిక పాలన నేపథ్యంలో 16 ఏళ్ల పాటు రాజకీయ బహిష్కరణకు గురయ్యారు. అంతేకాక 1973లో విమానం హైజాక్ ఆరోపణలతో మూడేళ్ల పాటు జైలు జీవితం కూడా గడిపారు. సుశీల్ కొయిరాలా ముగ్గురు సోదరులు మాత్రిక ప్రసాద్ కొయిరాలా, గిరిజా ప్రసాద్ కొయిరాలా, బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాలా కూడా నేపాల్ ప్రధానులుగా పనిచేశారు.

  • Loading...

More Telugu News