: ప్రధానితో భేటీ కానున్న చంద్రబాబు... ఏపీకి ‘హోదా’ను ప్రస్తావించనున్న సీఎం


రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న మొత్తం బిజీబిజీగా గడిపారు. నిన్న సాయంత్రం ప్రధాని నేతృత్వంలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీకి హాజరయ్యారు. తాజాగా నేడు కూడా చంద్రబాబు ఢిల్లీ షెడ్యూల్ బిజీగానే ఉంది. నేటి ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ ఎదుర్కొంటున్న చిక్కులు, వాటిని అధిగమించేందుకు కేంద్రం చేయాల్సిన సహకారాలను చంద్రబాబు ప్రస్తావించనున్నట్లు సమాచారం. పనిలో పనిగా విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న విషయాన్ని కూడా మరోమారు చంద్రబాబు ప్రధాని ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News