: పఠాన్ కోట్ దాడిలో మసూద్ పాత్ర లేదు... భారత్ వాదన సరికాదన్న పాక్ దర్యాప్తు బృందం


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడిలో జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ పాత్ర ఎంతమాత్రం లేదని పాకిస్థాన్ దర్యాప్తు బృందం తేల్చిచెప్పింది. పఠాన్ కోట్ దాడికి పాక్ భూభాగంపైనే వ్యూహ రచన జరిగిందని, మసూద్ అజారే కీలక సూత్రధారిగా వ్యవహరించారని భారత్ వాదించింది. ఈ మేరకు ఎయిర్ బేస్ లో లభించిన పలు కీలక ఆధారాలతో పాక్ కు నివేదిక అందజేసింది. మసూద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో కాస్తంత వేగంగా స్పందించిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.. పలు విభాగాలతో కూడిన అత్యున్నత దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సదరు దర్యాప్తు బృందం వెనువెంటనే రంగంలోకి దిగింది. మసూద్ సహా జైషే సంస్థకు చెందిన పలువురిని ఆ బృందం అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ వార్తలన్నీ అవాస్తవమేనని తేలిపోయింది. తాజాగా పఠాన్ కోట్ దాడిలో మసూద్ పాత్ర ఉందనడానికి గల ఆధారాలేమీ లభించలేదని ఆ బృందం సభ్యులను ఉటంకిస్తూ నిన్న పాక్ మీడియా పలు కథనాలను రాసింది.

  • Loading...

More Telugu News