: ముఖేశ్ అంబానీతో కేటీఆర్ భేటీ
ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీతో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు ముంబైలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనేక అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ ఆయనకు వివరించారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల గురించి, విద్యుత్ ప్రణాళికల గురించి ముఖేశ్ అంబానీకి వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో ముఖేశ్ చెబుతూ, తెలంగాణ ప్రభుత్వం సరైన ప్రణాళిక, కార్యాచరణతో ముందుకు వెళ్తోందని, టీ-సర్కార్ తో కలిసి పనిచేసేందుకు తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని అన్నట్లు సమాచారం. కాగా, గ్రేటర్ ఎన్నికల ఫలితాలు విడుదలైన మర్నాడు హైదరాబాద్ లో కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. ఆ తర్వాత ఒక్కరోజు గ్యాప్ తీసుకున్న కేటీఆర్ ఈరోజు ముంబైకి వెళ్లి టాటా గ్రూప్ చైర్మన్ మిస్త్రీతో భేటీ అయ్యారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం గురించి మిస్త్రీకి వివరించారు. అనంతరం రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీని కేటీఆర్ కలుసుకున్నారు.