: అమ్మాయిలతో రకరకాల అబద్ధాలు ఆడుతున్న అబ్బాయిలు!
అమ్మాయిలను బుట్టలో పడేయడానికి అబ్బాయిలు ఎన్నో అబద్ధాలు చెబుతుంటారు. అయితే ఫారిన్ అబ్బాయిలు డేటింగ్ కోసం అమ్మాయిలతో ఎలాంటి అబద్ధాలు చెబుతారు? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రఖ్యాత రిడిట్ వెబ్ సైట్ 'హంటర్' అనే సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా డేటింగ్ కోసం అబ్బాయిలు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని తేల్చింది. కొందరు పేరు, వయసు, ఉద్యోగం, ఊరు... తదితరాలపై అబద్ధాలు చెబితే; ఇంకొందరేమో 'నేను బ్యాట్ మన్ ని', 'మా నాన్న శ్రీమంతుడు', 'నా హైట్ ఆరు అడుగులు' అంటూ అబద్ధాలు చెప్పారు. ఇంకొందరు మరింత ముందుకు వెళ్లి తాము యుద్ధాన్ని నిరోధించే శాంతిదళంలో సభ్యులమని చెప్పగా, మరి కొందరు తాము వ్యోమగాములమని పేర్కొన్నారట. అంతా చెప్పిన కామన్ అబద్ధం మాత్రం 'ఐ లవ్యూ' అనేనని రిడిట్ తెలిపింది. అయితే ఎన్ని అబద్ధాలు చెప్పినా, అమ్మాయిలు వాటిని నమ్మేయడం విశేషం అని ఆ వెబ్ సైట్ ముక్తాయించింది.