: ఆ పాత్ర కోసం కరణ్ జోహర్ నన్ను మూడు నెలలు బతిమాలాడు: కరీనా కపూర్


ఆ పాత్ర కోసం కరణ్ జోహర్ తనను మూడు నెలలు బతిమాలాడని బాలీవుడ్ నటి కరీనా కపూర్ తెలిపింది. కరణ్ జోహర్ 'ఉడ్తా పంజాబ్' పేరిట ఓ సినిమాను షాహిద్ కపూర్, అలియా భట్ లతో తీస్తున్నాడు. ఈ సినిమాలో ఓ అతిథి పాత్ర కోసం షాహిద్ కపూర్ తన మాజీ ప్రేయసి కరీనా కపూర్ పేరును సూచించాడట. కరీనాను ఎలాగైనా ఒప్పించి నటింపజేయాలని కోరాడట. దీంతో కరీనాను ఒప్పించడానికి కరణ్ జోహార్ కు మూడు నెలలు పట్టిందట. అయితే ఈ పాత్రను కరణ్ జోహర్ కోసమే చేస్తున్నానని కరీనా చెప్పింది. కాగా, ఈ సినిమాలో పంజాబ్ లో విస్తరిస్తున్న డ్రగ్ సంస్కృతిని దర్శకుడు చర్చిస్తున్నాడు. 2007లో వచ్చిన 'జబ్ వి మెట్' సినిమాలో షాహిద్, కరీనా కలిసి అభిమానులకు కనువిందు చేశారు. అప్పట్లో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన వీరిద్దరూ అనంతరం ఏర్పడిన మనస్పర్ధలతో విడిపోయారు. ఆ తర్వాత కరీనా, ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకోగా, షాహిద్ కపూర్ పెద్దలు కుదిర్చిన మీరా రాజ్ పుత్ ను వివాహం చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News