: డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంలో భాగస్వామ్యానికి టాటా గ్రూప్ అంగీకారం


ముంబయి పర్యటనలో తెలంగాణ మంత్రి కేటీఆర్ టాటా గ్రూపు సంస్థల ఛైర్మన్ సైరస్ మిస్త్రీని కలిశారు. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని కేటీఆర్ కోరగా, ఈ పథకంలో భాగస్వామ్యమయ్యేందుకు అంగీకారం తెలిపారు. హైదరాబాద్ లో టాటాస్పేస్ ఏఐజీ టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుకు, టాటా క్యాపిటల్ తో టీహబ్ ఇన్నేవేషన్ కు ఆర్థిక సహకారమందించేందుకు మిస్త్రీ సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కూడా టాటాగ్రూప్ ఆసక్తి తెలిపింది.

  • Loading...

More Telugu News