: సీఎం కేసీఆర్ ను కలిసిన ‘ఫార్మా’ ప్రతినిధులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫార్మా రంగ ప్రతినిధులు ఈరోజు కలిశారు. ఫార్మాసిటీ నిర్మాణం విషయమై ఆయనతో చర్చించారు. సీఎంను కలిసిన వారిలో ఫెర్రింగ్ ఫార్మా చైర్మన్ ఫ్రెడరిక్ పాల్సన్, సీఎండీ అశోక్ అలైట్ ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మా సిటీని నిర్మిస్తామని, ఫార్మా విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పుతామని ఆయన స్పష్టం చేశారు. ఫార్మాసిటీలో భాగంగా ప్రత్యేక టౌన్ షిప్, ఉమ్మడి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీఎస్ ఐపాస్ వివరాలను ప్రతినిధులకు కేసీఆర్ వివరించారు. కాగా, తమ యూనిట్ల వల్ల ఎలాంటి కాలుష్య సమస్యలు తలెత్తవన్న విషయాన్ని ఫార్మా ప్రతినిధులు కేసీఆర్ కు వివరించారు.