: ఇది ముద్రగడ విజయం: దాసరి నారాయణరావు
కాపుల రిజర్వేషన్ కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభంను ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పరామర్శించారు. ఈ సందర్భంగా కిర్లంపూడిలో ఆయన మాట్లాడుతూ, ఇది ముద్రగడ విజయమని అన్నారు. ముద్రగడ దీక్ష ప్రభుత్వాన్ని కదిలించిందని ఆయన పేర్కొన్నారు. అరు నెలల్లో సమస్యను పరిష్కరిస్తానన్న చంద్రబాబునాయుడు 22 నెలలైనా స్పందించకపోవడంతో ముద్రగడ దీక్షకు దిగాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు ముద్రగడ లేఖ రాసినప్పుడే స్పందించి ఉంటే ఇంత జరిగి ఉండేదికాదని దాసరి అన్నారు.