: నారా రోహిత్ కు నేను అభిమానిని మాత్రమే... నేను ఎలాంటి మోసాలకు పాల్పడలేదు: టీఎన్ఎస్ఎఫ్ నేత సాయికృష్ణ


సినీ హీరో నారా రోహిత్ పేరుతో కోట్లాది రూపాయలు తాను వసూలు చేశానంటూ వస్తున్న వార్తలను టీఎన్ఎస్ఎఫ్ నేత సాయికృష్ణ ఖండించాడు. తాను కేవలం కొంతమంది వద్ద అప్పులు మాత్రమే తీసుకున్నానని, అది మాత్రం వాస్తవమని ఓ తెలుగు చానల్ తో మాట్లాడుతూ తెలిపాడు. కొంతకాలం నుంచి తనకు ఎలాంటి పనులు లేక ఖాళీగా ఉన్నానని, అంతేకానీ ఎవరి వద్ద వసూళ్లకు పాల్పడలేదని చెప్పాడు. తాను అప్పులు తీసుకున్నవారికి వడ్డీలు కూడా చెల్లిస్తున్నానని సాయికృష్ణ వివరించాడు. ఇక హీరో నారా రోహిత్ కు తాను కేవలం అభిమానినని, ఆయన సినిమాలు చూస్తానని తెలిపాడు. అంతేగాక టీడీపీలో కూడా పనిచేస్తుంటానన్నాడు. తెలుగుదేశంలో తన ఎదుగుదలను చూసి ఓర్వలేని ఇతర పార్టీలవారే ఇలా తనపై ఆరోపణలు చేస్తున్నారని సాయికృష్ణ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News