: హుబ్లీ రైల్వేస్టేషన్ లో కుప్పకూలిన పార్శిల్ భవనం!
కర్నాటక రాష్ట్రంలోని హుబ్లీ రైల్వేస్టేషన్ లోని పార్శిల్ కార్యాలయ భవనం కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ భవనంలోనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఆ శిథిలాల కింద ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు కూడా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో సహాయ చర్యలు ప్రారంభించారు. ఇందులో పాల్గొనడానికి రెండు ఫైరింజన్లు, మూడు జేసీబీలను రంగంలోకి దింపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.