: నాలుగు నెలల్లో విశాఖ మరింత సుందరంగా మారుతుంది: చంద్రబాబు
సీఐఐ సదస్సు, అంతర్జాతీయ నేవల్ ఫ్లీట్ నిర్వహించడంతో విశాఖపట్టణం అంతర్జాతీయ గుర్తింపు సంపాదించుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఈ రెండు కార్యక్రమాలకు ప్రపంచ స్థాయి ప్రతినిధులు వచ్చారని అన్నారు. వచ్చిన వారంతా విశాఖను చూసి అచ్చెరువొందారని ఆయన తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇంత అద్భుతమైన సిటీ ఇండియాలో ఉందా? అని ఆశ్చర్యపోయారని ఆయన అన్నారు. ఏడాది క్రితం హుదూద్ తుపానుతో అతలాకుతలమైన విశాఖ ఇంత గొప్పగా ఎలా కోలుకుందని అంతా ఆశ్చర్యపోయారని ఆయన చెప్పారు. ప్లీట్ రివ్వ్యూకి సుమారు ఆరు లక్షల మంది హాజరయ్యారని ఆయన చెప్పారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎంతో క్రమశిక్షణతో నిర్వహించిన నేవీకి అభినందనలని ఆయన తెలిపారు. సరిగ్గా నాలుగు నెలల్లో విశాఖపట్టణం సరికొత్త రూపు సంతరించుకుంటుందని ఆయన ధీమాగా చెప్పారు.