: అమెరికాలో నిందితుడు... ముంబైలో విచారణ!: కొత్త పుంతలు తొక్కిన కోర్టు విచారణ


నిజమే... నేటి ఉదయం కోర్టు విచారణ కొత్త పుంతలు తొక్కింది. ఎక్కడో అమెరికా జైల్లో ఉన్న నిందితుడిని, ముంబైలో ఉన్న కోర్టు విచారించింది. అది కూడా ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన ముంబై మారణహోమానికి సంబంధించిన కేసులో ఈ విచారణ చోటుచేసుకోవడం గమనార్హం. దూరాన ఉన్న నిందితులను విచారించేందుకు కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ను ఆశ్రయిస్తున్న ఉదంతాలు కొత్తవేమీ కాదు. అక్రమాస్తుల కేసులో చంచల్ గూడ జైల్లో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. అయితే దేశ సరిహద్దులు దాటి ఇతర దేశంలోని జైల్లో ఉన్న నిందితుడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశీయ కోర్టు విచారించడం మాత్రం ఇదే ప్రథమం. ముంబై దాడుల కేసులో దోషిగా తేలిన డేవిడ్ కోల్మన్ హెడ్లీకి అమెరికా కోర్టు ఇప్పటికే 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో ముంబైలోనూ అతడిపై కేసు నమోదైంది. ఈ కేసులో అప్రూవర్ గా మారితే శిక్ష నుంచి విముక్తి కల్పిస్తామన్న భారత్ బంపరాఫర్ తో అతడు దారికొచ్చాడు. పాక్ పన్నాగాన్ని వివరించేందుకు ఒప్పుకున్నాడు. వెరసి నేటి ఉదయం ప్రారంభమైన కోర్టు విచారణలో భాగంగా అమెరికాలోని జైలు నుంచే అతడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబైలోని న్యాయమూర్తి ముందు తన నేరాన్ని అంగీకరించాడు.

  • Loading...

More Telugu News