: పోలీసుల అదుపులో చిరంజీవి, రఘువీరారెడ్డి


కాపులకు రిజర్వేషన్ల కోసం తన ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించి, కాపు రిజర్వేషన్లకు సంఘీభావం తెలిపే నిమిత్తం, ఈ ఉదయం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ఎయిర్ పోర్టు స్టేషన్ లో నిర్బంధించగా, తమ నేతలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలు విమానాశ్రయం సమీపంలో నిరసన తెలియజేస్తుండటంతో, ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతలు కిర్లంపూడికి వెళితే, అక్కడ అనుకోని ఘటనలు జరుగవచ్చన్న ఉద్దేశంతోనే వారిని అడ్డుకున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడతో ప్రభుత్వ ప్రతినిధుల చర్చలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News