: పోలీసుల ఎదుట లొంగిపోయిన ఎంపీ అసదుద్దీన్


ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సౌత్ జోన్ డీసీపీ ఎదుట లొంగిపోయారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలపై దాడి కేసులో ఆయన సరెండర్ అయ్యారు. ఆ వెంటనే అసద్ ను వైద్య పరీక్షల కోసం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తరువాత నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. ఇదే కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేయగా, నలుగురికి బెయిలు మంజూరైంది.

  • Loading...

More Telugu News