: సాయికృష్ణతో నాకు సంబంధం లేదు... అతడు అభిమానిగానే తెలుసు: నారా రోహిత్


తన పేరు చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేసిన టీఎన్ఎస్ఎఫ్ నేత సాయికృష్ణతో తనకెలాంటి సంబంధం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి సోదరుడి కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ స్పష్టం చేశాడు. తన సినిమాల పేరిట సాయికృష్ణ విజయవాడలోని పలువురి నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేశాడని, అతడిపై భవానీపురం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అందిందని నేటి ఉదయం వార్తలు వచ్చిన వెంటనే నారా రోహిత్ చాలా వేగంగా స్పందించాడు. సాయికృష్ణ తనకు అభిమానిగానే తెలుసని ప్రకటించిన రోహిత్, అతడు చేసిన వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News