: టీఎన్ఎస్ఎఫ్ నేత ఘరానా మోసం... నారా రోహిత్ పేరిట భారీ వసూళ్లు


కాల్ మనీ సెక్స్ రాకెట్ స్వైర విహారం చేసిన విజయవాడలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. టీడీపీ అనుబంధ విద్యార్థి విభాగం తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్ఎస్ఎఫ్) కు చెందిన నేత సాయికృష్ణ పెద్ద ఎత్తున వసూళ్లు చేశాడు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి సోదరుడు నారా రామ్మోహన్ నాయుడి కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ సినిమాలను సాకుగా చూపిన అతడు కోట్లాది రూపాయలను పలువురి నుంచి తీసుకున్నాడు. అయితే గడువు ముగిసినా, అతడు రుణం చెల్లించకపోవడంతో రుణ దాతలు అతడిని నిలదీశారు. డబ్బు కోసం వేధిస్తే కాల్ మనీ కింద కేసు పెడతానంటూ సాయికృష్ణ రుణ దాతలను బెదిరించాడట. దీంతో బెంబేలెత్తిపోయిన రుణ దాతలు అతడిపై భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాయికృష్ణ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News