: కుర్రకారు డ్రంకన్ డ్రైవ్... కేంద్ర మాజీ మంత్రి ఇంటిలోకి దూసుకెళ్లిన కారు


భాగ్యనగరి హైదరాబాదులో కుర్రకారును డ్రంకన్ డ్రైవింగ్ నుంచి దూరంగా ఉంచడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. వారాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నా, ప్రతివారం యువత మత్తులోనే వాహనాలు నడుపుతూ భారీ ప్రమాదాలకే కారణమవుతున్నారు. నిన్న రాత్రి ఈ తరహాలోనే మద్యం మత్తు తలకెక్కిన ఓ యువకుడు తన కారుతో కేంద్ర మాజీ మంత్రి ఇంటిలోకి దూసుకెళ్లాడు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబరు 52లో జరిగిన ఈ ఘటనలో కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ ఇంటి ముందున్న సెక్యూరిటీ గది పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో ఎయిర్ బ్యాగులు సకాలంలో ఓపెన్ కావడంతో డ్రంకన్ డ్రైవ్ కుర్రాడితో పాటు కారులోని అతడి స్నేహితుడు, మరో ఇద్దరు యువతులు క్షేమంగా బయటపడ్డారు. అప్పటికే మత్తులో జోగుతున్న వారంతా ప్రమాదం జరిగిన వెంటనే కారు దిగి అక్కడి నుంచి పరుగు లంకించుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News