: ఉత్తరాంధ్రలో మహోదయ పుణ్య స్నానాలు... లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు


ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో మహోదయ పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో భక్తులు జిల్లాలోని బారు సమీపంలోని మహేంద్ర తనయ, కే. మత్స్యలేశం సమీపంలో వంశధార, కల్లేపల్లి సమీపంలో నాగావళి నదుల సముద్ర సంగమ ప్రదేశాలకు భారీగా తరలివచ్చారు. ఈ ప్రదేశాలతో పాటు శ్రీకూర్మం వద్ద సముద్రం వద్దకు భక్తులు బారులు తీరారు. పుష్యమాసం, అమావాస్య, శ్రావణ నక్షత్రం, వ్యతీపాత యోగం... కలగలసిన నేడు (సోమవారం) మహోదయంగా పరిగణిస్తున్నారు. ఈ అరుదైన సందర్భంలో పుణ్య స్నానాలు చేస్తే అనంతకోటి ఫలాన్నిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో నేటి మహోదయ సందర్భాన సముద్రంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

  • Loading...

More Telugu News