: మనవాళ్లే మనవాళ్లను గుర్తించరు!: 'ఫ్లూట్' నవీన్


బాలీవుడ్ లో గుర్తింపు వచ్చింది.. హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నాను.. కానీ, మన రాష్ట్రంలో ఎన్నో తెలుగు సినిమాలకు ఫ్లూట్ సహకారమందించినా తనకు తగిన గుర్తింపు రాలేదని రెహ్మాన్ ఆస్థాన ఫ్లూట్ విద్వాంసుడు నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కళాకారుడికి కావాల్సింది గుర్తింపు, ప్రశంసలతో పాటు నాలుగు చప్పట్లని అన్నారు. అవి రానంతకాలం నిరాశగానే ఉంటుందని, అదీ.. పుట్టినగడ్డలో రావాల్సినంత పేరు రాకపోతే మరింత బాధగా ఉంటుందని నవీన్ అన్నారు. 'మనవాళ్లే మనవాళ్లను గుర్తించరు. ఉదాహరణకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వాళ్లకు రావాల్సిన గుర్తింపు ఎంతవరకు ఇస్తున్నారు?’ అని ఆయన ప్రశ్నించారు. తెలుగు చిత్రరంగం విషయానికి వస్తే సంగీత దర్శకులు ఇళయరాజా, సత్యం, రమేష్ నాయుడు, చక్రవర్తి, కీరవాణి, మణిశర్మ, రాజ్ కోటి, దేవిశ్రీప్రసాద్ వంటి సంగీత దర్శకుల వద్ద తాను పనిచేశానని అన్నారు. ఇళయరాజా తనకు చాలా ఇష్టమైన సంగీత దర్శకుడని విశాఖపట్టణానికి చెందిన నవీన్ అన్నారు.

  • Loading...

More Telugu News