: సినిమా స్క్రిప్టే ఆయనకు భగవద్గీత: పోసాని


దర్శకుడు భీమనేని శ్రీనివాస్ కు సినిమా స్క్రిప్టే భగవద్గీత, బైబిల్, ఖురాన్ తో సమానమని పోసాని కృష్ణమురళీ ప్రశంసలతో ముంచెత్తారు. కేవలం కథాబలంతోనే భీమనేని సూపర్ హిట్ చిత్రాలు తీశారని, ఆయనకు కథే మొదటిహీరో అని అన్నారు. పెద్ద హీరో, హీరోయిన్ దొరికారు కదా అని చెప్పి ఆయన సినిమాలు తీయరని, ఒకవేళ ఏ హీరో అయినా కథ ఇచ్చి భీమనేనిని సినిమా తీయమంటే.. ఆ కథ తనకు నచ్చితేనే అందుకు ఆయన ఒప్పుకుంటారని అన్నారు. భీమనేని సినిమాలంటే కథ అడగకుండానే ఎవరైనా ఆయన సినిమాలో నటించవచ్చని పోసాని చెప్పారు.

  • Loading...

More Telugu News