: చిరంజీవి సినిమాకి కూడా ఇంత పబ్లిసిటీ చేయరు: పోసాని
'స్పీడున్నోడు' చిత్రానికి చేసినంత పబ్లిసిటీ చిరంజీవి సినిమాకు కూడా చేయరని ప్రముఖ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళీ అన్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన 'స్పీడున్నోడు' చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ, ‘చిరంజీవిని హీరోగా పెట్టుకుని సురేష్ బాబు సినిమా తీసినా కూడా ఈ చిత్రానికి చేసినంత పబ్లిసిటీ చేయరేమో అనిపిస్తోంది. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కోసం అతని తండ్రి బెల్లంకొండ సురేష్ అంతగా కష్టపడ్డాడు. తన కొడుకుని హీరోగా నిలబెట్టాలని, విజయం సాధించాలని ఆయన ఎంతగానో కష్టపడ్డాడు. నా ముప్ఫై ఏళ్ల అనుభవంలో ఇంతగా పబ్లిసిటీ చేసిన నిర్మాతను నేను చూడలేదు’ అని పోసాని అన్నారు.