: సంజయ్ దత్ కు విచిత్రమైన శిక్ష విధించిన నానాపటేకర్!


నటుడు సంజయ్ దత్ కు బాలీవుడ్ ప్రముఖ నటుడు నానాపటేకర్ కఠినమైన శిక్ష విధించాడు. ఇంకెప్పుడూ సంజయ్ తో కలిసి నటించననీ, అతని చిత్రాలెప్పుడూ చూడనని ప్రకటించాడు. ఇదే తనవైపు నుంచి సంజూకి విధించే శిక్ష అని 62 ఏళ్ల ఈ నటుడు తెలిపాడు. 1993 నాటి ముంబయి బాంబు పేలుళ్ల కేసులో సంజూకు సుప్రీంకోర్టు 5 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ మార్చిలో తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. అప్పటికే ఒప్పుకున్న చిత్రాలు ఉండడంతో కొంతసమయం కావాలని కోర్టును సంజయ్ అభ్యర్ధించడంతో నెలరోజుల సమయం ఇచ్చింది. దాంతో మే నెలలో కోర్టు ఎదుట లొంగిపోనున్నాడు.

దీనిపై ఓ మరాఠీ ఛానల్ తో పటేకర్ మాట్లాడుతూ..''పేలుళ్ల కేసు విచారణలో వందమంది ప్రముఖ వ్యక్తులు పాలుపంచుకున్నారు. కోర్టు 12 మందికి మరణశిక్ష విధించగా, 20 మందికి జీవిత శిక్ష విధించింది. సంజు చేసిన నేరం భయంకరమైనది. అటువంటప్పుడు అతని పట్లే న్యాయం ఎందుకు భిన్నంగా వ్యవహరించింది? న్యాయం పేదల పట్ల ఒకవిధంగా, అతనిపట్ల మరో విధంగా వ్యవహరించింది. ఎందుకంటే అతను నటుడు కాబట్టి... అందుకేనా?" అని అడిగాడు. సంజయ్ కు క్షమాభిక్ష పెట్టాలంటూ హిందీ చలనచిత్ర పరిశ్రమలో పలువురు నటులు మద్దతు పలకిన నేపథ్యంలో పటేకర్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.

  • Loading...

More Telugu News